ఈవీఎం గోడౌన్ల వద్ద 24×7 నిఘా : కలెక్టర్‌

ఈవీఎం గోడౌన్ల వద్ద 24×7 నిఘా : కలెక్టర్‌

ఈవీఎం గోడౌన్ల వద్ద 24×7 నిఘా : కలెక్టర్‌ప్రజాశక్తి – రేణిగుంట జిల్లాకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్రపరిచిన గోదాము వద్ద 24×7 నిరంతరం పటిష్టమైన నిఘా, భద్రత యధావిధిగా కొనసాగాలని, పీ.ఓ, ఎపీఓ ల శిక్షణ కొరకు వినియోగించనున్న డెమో ఈవిఎం లను అత్యంత భద్రత నడుమ సంబంధిత రెవెన్యూ డివిజన్లకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ జి.లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ గోడౌన్‌లో భద్రపరచిన ఈవిఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్‌ ఇన్‌ఛార్జి కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ పిఒ, ఎపిఒల శిక్షణ నిమిత్తం గతంలో రెవెన్యూ డివిజన్లకు 46 ఇచ్చామని తెలిపారు. సిఇఒ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 20 చొప్పున గతంలో ఇచ్చినవి పోను 94 ఇవిఎంలను నాలుగు రెవెన్యూ డివిజన్లకు భద్రత నడుమ పంపనున్నట్లు తెలిపారు. అధికారులు చంద్రశేఖర్‌, పవన్‌, టిడిపి మనోహరాచారి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ చిరంజీవి పాల్గొన్నారు.

➡️