కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతా సీజ్‌ దుర్మార్గం: గోపి

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతా సీజ్‌ దుర్మార్గం: గోపి

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతా సీజ్‌ దుర్మార్గం: గోపిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోందని, అందులో భాగమే కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేయించారని కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు యార్లపల్లి గోపి ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార దాహంతో బిజెపి దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీపై, ఆప్‌ పార్టీపై ఈడిని ఉసుగొల్పి అక్రమ కేసులను బనాయించి నేతలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని బిజెపి కుట్ర రాజకీయాలకు తెరతేసిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఈ సమావేశంలో అబ్దుల్‌ మజీద్‌ పటేల్‌, మునిశోభా, షేక్‌ జావేద్‌ పాల్గొన్నారు.

➡️