కార్పొరేట్ విద్యా సంస్థలో విద్యార్థులను చేర్చొదు : ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాశక్తి – క్యాంపస్ (చంద్రగిరి) కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్థులను చేర్చొద్దని ఎస్‌ఎఫ్‌ఐ చంద్రగిరి కార్యదర్శి తేజ తల్లితండ్రులను కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థలలో చేర్చి విద్యార్థుల జీవితాలను నాశనం చేయొద్దని కరపత్రం విడుదల చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలో కేవలం చదువుల ఒత్తిడి, అక్రమ ఫీజులు తప్ప ఇక విద్యార్థులకు మానసిక ఎదుగుదల, సమాజం పట్ల అవగాహన శూన్యం అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ ను అరికట్టడం లో విద్యా శాఖ అధికారులు విఫలం చెందారని విమర్శించారు. ముందస్తు అక్రమ అడ్మిషన్స్ నిర్వహిస్తే ఆర్‌ఐఒ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐగా ప్రత్యక్షంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
