గగన శోధనలో వికసిత భారత్ : వీసీ క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని స్టేడియంలో 75 వ గణతంత్రదిన వేడుకలకు ఉపకులపతి ఆచార్య వి. శ్రీకాంత్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశం వికసిత భారత్ గా ముందుకు సాగుతుందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రపంచంలో మూడవ స్థానాన్ని, చంద్రునిపై అన్వేషణలు జరపడంలో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకోవడం గొప్ప ప్రజాస్వామిక బలం అన్నారు. యస్వీయూలో ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ,నీలిట్ కేంద్రం , ఎం. యస్ . డేటాసైన్స్ , స్టార్టప్ లు వంటివి బోధన , పరిశోధన రంగాల్లో ప్రగతి దిశగా తీసుకెళ్లబోతున్న సంకేతాలని అన్నారు. ఈ వేడుకల్లో రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు.- శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో వీసీ ప్రొఫెసర్ డి.భారతి, రిజిస్ట్రార్ ఎన్.రజిని, డీన్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ సుజాతమ్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాభవాని హాజరయ్యారు. – వ్యవసాయ కళాశాలలో వాతావరణ మార్పులపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అసోసియేట్ ఇన్ డాక్టర్ జి. ప్రభాకర్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో జాతీయ జెండాను వ్యవసాయ కళాశాల అసోసియేట్ డాక్టర్ జి. ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు.-శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఉపకులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, సాహిత్య విభాగం ఆచార్యులు ఆచార్య చక్రవర్తుల రంగనాథన్ హాజరయ్యారు. – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మహదేవమ్మ అధ్యక్షతన జరిగింది. ఎన్ని అసమానతలు ఉన్నా మానవహక్కుల ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. – ఎస్వీ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సి.ప్రకాష్‌బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో డాక్టర్ సి.భువనేశ్వరి పాల్గొన్నారు.
