గో ఆధారిత ఃమట్టి మనిషిః డేగా సుబ్రమణ్యం

గో ఆధారిత ఃమట్టి మనిషిః డేగా సుబ్రమణ్యం

గో ఆధారిత ఃమట్టి మనిషిః డేగా సుబ్రమణ్యంప్రజాశక్తి – కెవిబిపురం గ్రామాల్లో రైతులు రసాయన ఎరువులతో విసిగిపోయారు.. రసాయన ఎరువులతో పుడమి కలుషితమైపోయింది.. ఈ నేపథ్యంలో గో ఆధారిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు డేగా సుబ్రమణ్యం యాదవ్‌. తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ లాభాలొస్తున్నాయని చెబుతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కెవిబిపురం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మట్టి మనిషి, సర్పంచి డేగా సుబ్రమణ్యం సక్సెస్‌ స్టోరీ అన్నదాతల కోసం…దశాబ్ద కాలంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల మాయలో అనేక రకాల రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం సేద్యాన్ని పతనావస్థకు చేర్చింది. భూములు నిస్సారంగా మారి, చీడపీడల ఉధతి పెరిగి దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. ఓవైపు పెరిగిన పెట్టుబడి, మరోవైపు కూలీల కొరతతో సాగు భారం రైతన్నను వెంటాడుతోంది. సంపాదనలో 80 శాతం వైద్యానికే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన సేవ్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకులు విజయరామ్‌ సహకారంతో డేగా సుబ్రమణ్యం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. ఏడేళ్ల క్రితం వరకూ ఎకరం పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించిన ఆయన నేడు మూడు ఎకరాల్లో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 400 రకాల దేశవాళీ విత్తనాలను పరిరక్షిస్తూ, ప్రధాన రకాల పంటలను స్వయంగా పండించి, ప్రాసెసింగ్‌ నిర్వహించి ప్రస్తుత మార్కెట్‌ ధరల కంటే తక్కువగా అందిస్తున్నారు. సహజ సిద్ధంగా లభించే ఆవుపేడ, సొంతంగా తయారు చేసిన జీవామృతాలు, రసాయన రహిత ఎరువుల ద్వారా పండించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషనరీ ద్వారా అత్యంత నాణ్యతా ప్రమాణాలతో అందించాలన్న సంకల్పంతో దేశవాళీ ప్రధాన రకాలైన భాహురూపి, నివారిణి నవార, మైసూర్‌ మల్లిగ, చిట్టి ముత్యాలు పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పైరు ఐదు అడుగులకు పైగా పొడవుతో సాగవుతున్న పంటల సాగు కాలం 120-140 రోజులు. ప్రస్తుతం పండిస్తున్న రకాలు,వాటి ప్రాధాన్యతభాహురూపి:- పంట కాలం 140 రోజులు. మోకాలి నొప్పులు, మలబద్దకం తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచి, రోజంతా ఉత్తేజభరితంగా ఉండటానికి సహాయపడుతుంది. రోజు వారి వాడకానికి ఉపయోగపడే రకం.నివారిణి,నవార:పంట కాలం 120 రోజులు కాగా, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు వ్యాధి నియంత్రణలో ఉంచడానికి అత్యంత ఉపయోగకరమైన రకం. 45 రోజులు క్రమం తప్పకుండా వాడితే షుగర్‌ వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. కిలో 80 రూపాయలు.ఆరోగ్యమే మహాభాగ్యం : డేగా సుబ్రమణ్యం మనిషి మనుగడ ఉన్నంత వరకూ వ్యవసాయం ఉంటుంది. ఓ రైతు ఓ నాటు ఆవు పెంచుకుంటే ఒక ఎకరా ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. ఆవుపేడతో ప్రమిదలు, గోపంచితం లీటర్‌ పది రూపాయల లెక్కన అమ్ముతున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పండే పంటలు తినడం వల్ల మా ఇంట్లో ఎవరికీ ఏ జబ్బులూ రావడం లేదు. మా అమ్మ వయస్సు 95 సంవత్సరాలు. ఇప్పటికీ ఏ జబ్బు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. బీపీ, సుగర్‌ వ్యాధులు లేవు. ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తున్నాం.

➡️