డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా జెసి బాలాజీ బదిలీ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టరు డికే బాలాజీ ఆదివారం బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా జెసి డికే బాలాజీ బదిలీ అయిన నేపథ్యంలో జెసి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. తదుపరి రెగ్యులర్ జెసి నియమించబడే వరకు డిఆర్‌ఓ పెంచల కిషోర్ ఇంఛార్జి జెసిగా కొనసాగనున్నారు.
