తిరుమల్లో తెరుచుకున్న మహుంతు నివాసం(డోలు)శనివారం పంచనామా నిర్వహించిన అధికారులు తాత్కాలిక మహుంతుగా ఓంప్రకాష్ దాస్‌పాల్గొన్న ఫిట్ పర్సన్ రమేష్ నాయుడుప్రజాశక్తి- తిరుమల: అనేక వివాదాల నడుమ రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం హథీరాంజీ మఠం తాత్కాలిక మహుంతుగా ఓంప్రకాష్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఈనేపథ్యంలో తిరుమలలో శనివారం పోలీసులు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు, మఠం ఫిట్‌పర్సన్ రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ స్వామి హథీరాంజీ మఠంలో గల మహుంతు అధికారిక నివాసం (డోలు)కు పంచనామా నిర్వహించి తాత్కాలిక మహంతుగా బాధ్యతలు స్వీకరించిన ఓం ప్రకాష్ దాస్ ప్రవేశించారు. గత ఏడాది జూన్ 8వ తేదీన మాజీ మహంతు అర్జున్ దాస్ ఎదుర్కొంటున్న అక్రమాల ఆరోపణలు వాస్తవం అని తేలడంతో ధార్మిక పరిషత్ అర్జున్ దాస్‌ను మహంతు పదవి నుండి తప్పించింది. ఈ నేపథ్యంలో అర్జున్ దాస్ మఠం విడచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం ధార్మిక పరిషత్, రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు హాథీరాంజీ మఠంకు ఫిట్ పర్సన్‌గా రమేష్ నాయుడును ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన రమేష్ నాయుడు మఠంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ దాస్ బంధువులు అనధికారికంగా మఠంకు సంబంధించిన ఆస్తులను అనుభవిస్తున్నారని గుర్తించి నోటీసులు జారీచేసినా ఖాతరు చేయలేదని, దీంతో పోలీసుల సహాయంతో ఆయా ఆస్తులను పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని మఠం ఫిట్‌పర్సన్ తెలిపారు. పంచనామా అనంతరం తాత్కాలిక మహుంతు ఓం ప్రకాష్ దాస్‌కు అధికారిక నివాసంలో ఉన్న వస్తువులు, విలువైన సామాగ్రిని అప్పగించడం జరిగిందన్నారు. హథీరాంజీ మఠంకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకోవడంలో వేగం పెంచామని, పలు ప్రాంతాల్లో తమ సిబ్బందిపై దాడులకు దిగిన ఘటనలు జరిగాయన్నారు. ఏది ఏమైనా హథీరాంజీ మఠంకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పంచనామా కార్యక్రమంలో ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారిని సత్యవతి, మఠం ఏఈఓ శ్రీనివాసరెడ్డి, మఠం సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమల్లో తెరుచుకున్న మహుంతు నివాసం(డోలు)శనివారం పంచనామా నిర్వహించిన అధికారులు తాత్కాలిక మహుంతుగా ఓంప్రకాష్ దాస్‌పాల్గొన్న ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు
