దొంగ ఓట్లపై జనసేన దండయాత్రప్రజాశక్తి- తిరుపతి టౌన్‌తిరుపతిలో సుమారు నలబైవేల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నాయని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు శనివారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి, ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని, తక్షణమే వాటిని తొలగించి ఈ నెల 22న విడుదల చేయనున్న ఓటర్ల తుది జాబితాను వాయిదా వేయాలని, దొంగ ఓట్లకు తిరుపతి నిలయంగా మారిందని, కొందరు రాజకీయ నాయకుల మాటలు విని గతంలో దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారులు కొందరిని సస్పెండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండ దయచేసి నిస్వార్ధంగా పనిచేయాలని, ఓటర్ జాబితాను పున్ణ పరిశీలించాలని, ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు ఉందని తెలిసినా జనసేన పెద్ద ఎత్తున నిరసనలకు, ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు.
