నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్‌

నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్‌

నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్‌ ప్రజాశక్తి- తిరుపతిటౌన్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై ఓటరు నమోదు అధికారి, మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అదితి సింగ్‌ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శంగా నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని క్లెయిమ్స్‌, అబ్జెక్షన్లపై తదితర అంశాలపై వివరించారు. తిరుపతి నియోజకవర్గంలో 267 పోలింగ్‌ బూతులు ఉండగా, 1500 ఓటర్లు దాటిన పోలింగ్‌ బూతులు 4 ఉన్నాయని తెలిపారు. కావున వాటికి సమీపంలోనే మరో 4 సహాయ బూతులు ఏర్పర్చేందుకు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈసందర్భంగా రాజకీయపార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ సెలవు పెట్టిన, మారిపోయిన బిల్వోల స్థానాల్లో వచ్చిన వారి వివరాలను అందించాలని కోరరు.. త్వరలోనే అందిస్తామని, ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు అన్ని చర్యలు చేపడతామని కమిషనర్‌ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తిరుపతి అర్బన్‌ ఎమ్మార్వో వెంకట సూర్యనారాయణ రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, డిటి అశోక్‌ రెడ్డి, ఎఈఆర్వోలు, ఎన్నికల సెక్షన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️