భగత్ సింగ్‌కు నివాళులు ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిపిఎం నియోజకవర్గ కార్యరదర్శి ఆర్ వెంకటేష్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ దేశం కోసం, ప్రజల కోసం బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి ప్రాణ త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు భగత్ సింగ్ అని, ఆయన అడుగుజాడల్లో అందరం నడుచుకోవాలన్నారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మండల నాయకులు ఏ విజరు, కె.సుబ్రహ్మణ్యం, ఎస్ పురుషోత్తం, బి రమేష్ పాల్గొన్నారు.
