మిచౌంగ్ తుపాను నష్టపరిహారం రూ.5.90 కోట్లుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి అర్థిక భరోసా కల్పించే దిశగా బుధవారం మధ్యాహ్నం ఖరీఫ్ 2023 వర్షాభావం, 2023 మిచాంగ్ తుపాను వలన నష్ట పోయిన లబ్దిదారులకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమ చేశారు. కార్యక్రమానికి జిల్లా కల్లెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాలు నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మిశ, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, లబ్దిదారులతో కలిసి హాజరయ్యారు. మొత్తం 6996 రైతులకు రూ. 5.90 కోట్లు మెగా చెక్ ను అందజేశారు.
