మునిలక్ష్మిపై దాడి అమానుషంపరామర్శించిన సిపిఎం నేతలుప్రజాశక్తి- తిరుపతిటౌన్ తిరుపతి నగరంలో జరిగే పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సామాజిక కార్యకర్త మునిలక్ష్మిపై గుర్తు తెలీని కొందరు దుండగలు దాడికి పాల్పడటాన్ని సిపిఎం నేతలు వి.నాగరాజు, కందారపు మురళి తీవ్రంగా ఖండించారు. మంగళవారం మునిలక్ష్మిని ఆమె స్వగృహంలో పరామర్శించారు. సోమవారం రాత్రి కుర్రకాల్వ వద్ద పేదపిల్లల కోసం తాను నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్‌కు వెళ్లి తన కుమార్తెతో తిరిగి స్కూటర్‌పై వస్తుండగా గుర్తు తెలీని కొందరు వ్యక్తులు తనపకై కత్తితో దాడికి పాల్పడ్డారని, కత్తి గురి తప్పడంతో తాను కిందపడిపోయాయని దీంతో గాయాలయ్యాయని తెలిపారు. చుట్టుపక్కల వారు గమనించడంతో దుండగులు పారిపోయారని తెలిపారు. పోలీసులు మునిలక్ష్మిపై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు నూతన జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి: భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ మహిళా కో-ఆర్డినేటర్, ఆ పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి నెల్లూరు మునిలక్ష్మి మీద దుండగల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త నిరంజన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీన్ని పోలీసు వైఫల్యంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెంటనే దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేసి లక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాడిని ఖండించిన జైభారత్ అధినేత జేడీ లక్ష్మీనారాయణరేణిగుంట: జైభారత్ నేషనల్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిని రాయలసీమ మహిళా కో-ఆర్డినేటర్ నెల్లూరు మునిలక్ష్మిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేయడాన్ని జైభారత్ అధినేత జేడీ లక్ష్మీ నారాయణ ఖండించారు.ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడవద్దనే దాడి: మునిలక్ష్మీ తాను జైభారత్ నేషనల్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడవద్దనే అగంతుకులు ఈ దాడికి పాల్పడ్డారని మునిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. నీతినిజాయితీకి మారుపేరైన జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర అభివద్ధే ఎజెండాగా నడుపుతున్న జైభారత్ నేషనల్ పార్టీ రాయలసీమ కో-ఆర్డినేటర్‌గా తాను చురుకుగా పనిచేస్తుండటంతోనే తనపై హత్యయత్నానికి ప్రయత్నించారని ఆరోపించారు.
