మెగా డిఎస్‌సి ప్రకటించాలి

మెగా డిఎస్‌సి ప్రకటించాలి

మెగా డిఎస్‌సి ప్రకటించాలిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటు నిరుద్యోగులను నయవంచన చేసిందని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద 36 గంటల నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షను తూర్పు పశ్చిమగోదావరి జిల్లా శాసన మండలి సభ్యులు ఐ.వెంకటేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ జయచంద్ర రాష్ట్రంలో 1.88లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1. 69లక్షలు మాత్రమే ఉన్నారని, దాదాపు 18,520 ఖాళీగా ఉన్నాయని, ఇవే కాక ఈనెల చివరి నాటికి మరో 5వేలమంది ఉపాధ్యాయులు రిటైర్‌ అవుతున్నరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 117జీవో పేరుతో మరో 10వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలుగు మీడియం తీసివేసి 15వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిన ఘనత జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాసంస్థల్లోనూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️