రోజాకు సీటు ఇస్తే ఓటమి తథ్యం: మురళి

రోజాకు సీటు ఇస్తే ఓటమి తథ్యం: మురళి

రోజాకు సీటు ఇస్తే ఓటమి తథ్యం: మురళిప్రజాశక్తి-తిరుపతి(మంగళం):నగరి నియోజకవర్గంలో ఈసారి రోజాకు సీటు అధిష్టానం కేటాయిస్తే ఓటమి చద్యమని నిండ్ర మండల వైసీపీ నాయకులు మురళి స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగిరి నియోజవర్గ పరిధిలోని మండలాల వైసీపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఏర్పాటుచేసిన వైసిపి బలోపేతానికి కష్టించి పనిచేశామని, కానీ నేడు నగిరి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కష్టపడిన పార్టీ క్యాడర్‌ కు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. మంత్రి రోజా తన కుటుంబ పాలనతో నియోజకవర్గ పరిధిలోని పార్టీ కోసం పనిచేసిన వైసీపీ క్యాడర్‌ ను పక్కన పెట్టేసారన్నారు. దీంతో వైసిపి నాయకులతో పాటు ఆయా మండలాల ప్రజలు కూడా మంత్రి రోజాను చేదరించుకుంటున్నారన్నారు. ప్రోటోకాల్‌ పాటించకుండా మంత్రి రోజా నిండ్ర మండలం నెట్టేరు గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభించారన్నారు. దీన్నిబట్టి చూస్తేనే క్షేత్రస్థాయి పార్టీ క్యాడర్‌ పట్ల మంత్రి రోజాకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందన్నారు. మంత్రి రోజాకు నగిరి టికెట్‌ ఇస్తే ప్రజలు ఓడించడం ఖాయమని, ఇక అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు. నగిరిలో రోజా వద్దు- జగనే ముద్దు అనే నినాదంతో ప్రజలు ఉన్నారని, ఈ మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పరంధామయ్య యాదవ్‌, జయచంద్ర రెడ్డి, తులసిరామిరెడ్డి, మునీంద్ర రాయల్‌, వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.

➡️