విలీనంతో వేతనాలు బంద్‌పారిశుధ్య కార్మికులు లబోదిబో

విలీనంతో వేతనాలు బంద్‌పారిశుధ్య కార్మికులు లబోదిబో

విలీనంతో వేతనాలు బంద్‌పారిశుధ్య కార్మికులు లబోదిబోప్రజాశక్తి-తిరుపతి సిటి తిరుపతి అర్బన్‌లో మేజరు పంచాయతీగా ఉన్నదాన్ని కార్పొరేషన్‌లో విలీనం చేస్తామంటే తమ బతుకులు బాగుపడుతాయని అందరూ భావించారు. జీవనప్రమాణాలు పెరుగుతాయని ఆశించారు. పంచాయతీల్లో పని చేసే పారిశుద్ద కార్మికులు వేతనాలు పెరిగి, కుటుంబానికి కాస్త ఆసరా దొరుకుతుందని భావించారు. విలీనం ఎప్పడెప్పడా అని ఎదురుచూశారు. తీరా విలీనం అయ్యాక వారి బతుకులు రోడ్లపాలవడంతో లబోదిబో మంటూ విలపిస్తున్నారు. ఆరు నెలలుగా జీతం ఇస్తే ఒట్టు. కరవమంటే కప్పకు కోపం..విడమంటే పాముకు కోపం అన్న చందాగా శెట్టిపల్లి పంచాయతీ పారిశుద్ద కార్మికులు బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యింది. శెట్టిపల్లి పంచాయతీ. తిరుపతి అర్బన్‌లో మేజరు పంచాయతీ. మంగళం, శెట్టిపల్లి, వినాయకనగర్‌, మిట్టగాంధీపురం, సిఆర్‌ఎస్‌ క్వార్టర్స్‌, చెన్నారుగుంట, శెట్టిపల్లి హరిజనవాడ, ఉప్పరపాళెం, సప్తగిరినగర్‌ గ్రామాలతో పంచాయతీ ఉండేది. శెట్టిపల్లి పంచాయతీనికి తిరుపతి కార్పొరేషన్‌లో కలిపేందుకు యువ నాయకులు భూమన అభినరురెడ్డి చొరవ చూపడంతో ఏడాది కింద శెట్టిపల్లి పంచాయతీలోని కొన్ని గ్రామాలు మినహా అన్నింటిని తిరుపతి కార్పొరేషన్‌లో విలీనం చేశారు. చెన్నరుగుంట, మిట్టగాంధీపురం, పాతమంగళం గ్రామం, సప్తగిరినగర్‌ను కలిపి న్యూ మంగళం పంచాయతీగా ఏర్పాటు చేశారు. గతంలో శెట్టిపల్లి మేజరు పంచాయతీగా ఉన్నప్పడు పంచాయతీలో 20 మంది పారిశుద్ద కార్మికులు పని చేసేవారు. కార్పొరేషన్‌ విలీనంతో వారిలో 12 మందిని కార్పొరేషన్‌లో విలీనం చేశారు. మిగిలిన 8 మందిని ప్రస్తుతం మిగిలిన గ్రామాల్లోతో ఏర్పడిన పంచాయతీలోనే కొనసాగిస్తున్నారు. కార్పొరేషన్‌ విలీనంతో తమ బతుకులు కాస్త బాగుపడతాయనకున్న నిరుపేదలైన కార్మికులకు పరిస్థితి పెనెం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందాగా తయారైంది. కార్పొరేషన్‌లో విలీనం అయిన 12 మంది పారిశుద్ద కార్మికులకు వేతనాలు పెరగకపోగా కార్పొరేషన్‌ నుంచి కనీసం నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేదు. విలీనం తర్వాత కూడా కార్మికులు కుటుంబ పరిస్థితులు తెలిసిన పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆరు నెలల పాటు పంచాయతీ నుంచే గతంలో ఇస్తున్న వేతనాలను కార్మికులకు చెల్లించారు. ముందుగానే చిన్న పంచాయతీ, ఆదాయం తక్కువ కావడంతో కార్మికులందరికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి. దీంతో విలీన కార్మికులు పంచాయతీ వేతనాలు ఇవ్వడం నిలిపివేసింది. కార్పొరేషన్‌ కూడా వారి గురించి పట్టించుకోవడం లేదు. ఇంకా ఆర్డర్స్‌ రాలేదు. చేద్దాం..చూద్దాం అంటూ కార్పొరేషన్‌ అదికారులు చెబుతుండడంతో ఆరు నెలలుగా వేతనాలు లేక, రెక్కాడితేగాని డొక్కాడిన కార్మికులు వెట్టిచాకరీ చేస్తూనే ఉన్నారు. అధికారులు వారిపై కనీకరం చూపకపోవడం శోచనీయం. ఇప్పటికైన అధికారులు స్పందించి, తమను ఆదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. ఆ దిశగా ఆదికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వేకువజాము నుంచి కష్టపడుతున్నాం : వెంకటేశ్వర్లు, ఉప్పరపాళెం పంచాయతీ ప్రజలు నిద్రలేవక ముందే, వేకువజాము నుంచి పంచాయతీని శుభ్రపరిచేందుకు కష్టపడుతున్నాం. పంచాయతీ నీట్‌గా ఉందంటే మా కష్టం ఎంతో ఉంది. నిరంతరం కష్టించే తమను అధికారులు ఆదుకోవాలి.అప్పుల పాలవుతున్నాం : టి.తిరుపాల్‌, ఉప్పరపాలెం ఆరు నెలలుగా జీతాలు లేక అప్పలు చేసి మరి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. 22 సంవత్సరాలుగా పంచాయతీని నమ్ముకుని పని చేశాను. ఇప్పడు విలీనం తర్వాత వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి తమకు వేతనాలు ఇవ్వకుంటే కుటంబాలు రోడ్డుపాలే.ఎవ్వరో ఒకరు జీతాలు ఇవ్వండి : అమ్ములు, మిట్టగాంధీపురం శెట్టిపల్లి మేజరు పంచాయతీలో పని చేస్తున్న మమల్ని కార్పొరేషన్‌లో విలీనం చేశారు. కొన్ని రోజులు మా మొర ఆలకించి పంచాయతీ జీతాలు ఇచ్చింది. ఇప్పడు ఇవ్వలేమని చెప్పింది, మరో పక్క కార్పొరేషన్‌ అధికారుల్లో స్పందన లేదు. ఎవ్వరో ఒకరు జీతాలు ఇచ్చి మమ్మత్ని ఆదుకోండి.ఆరు నెలలుగా అలమిటిస్తున్నాం : శంకర, మంగళం గత ఆరు నెలలుగా జీతాలు లేక అలమటిస్తున్నాం. రోజూ పనులు చేయించుకుంటున్నారే తప్ప, జీతాలు ఇవ్వడం లేదు.కనీకరం చూపాలని అనేకసార్లు అధికారులను వేడుకున్నాం. ఇక నైనా స్పందించాలి.ఆరు నెలలుగా జీతాల్లేకపోతే ఎలా బతుకుతాం అనుకుంటున్నారు.

➡️