శ్రీసిటీని సందర్శించిన మిజోరాం గవర్నర్‌ – పారిశ్రామిక ప్రగతి, నైపుణ్యాభివద్ధి చర్యలపై ప్రశంస- మిజోరాం యువతకు ఉద్యోగ, నైపుణ్య శిక్షణ తోడ్పాటుకు పిలుపు

శ్రీసిటీని సందర్శించిన మిజోరాం గవర్నర్‌ - పారిశ్రామిక ప్రగతి, నైపుణ్యాభివద్ధి చర్యలపై ప్రశంస- మిజోరాం యువతకు ఉద్యోగ, నైపుణ్య శిక్షణ తోడ్పాటుకు పిలుపు

శ్రీసిటీని సందర్శించిన మిజోరాం గవర్నర్‌ – పారిశ్రామిక ప్రగతి, నైపుణ్యాభివద్ధి చర్యలపై ప్రశంస- మిజోరాం యువతకు ఉద్యోగ, నైపుణ్య శిక్షణ తోడ్పాటుకు పిలుపు ప్రజాశక్తి- వరదయ్యపాలెం: శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, నైపుణ్యాభివద్ధి, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాలను మిజోరాం గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు ప్రశంసించారు. బుధవారం మధ్యాహ్నం శ్రీసిటీని సందర్శించిన గవర్నర్‌ కు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీలో మొట్టమొదటి గవర్నర్‌ పర్యటన ఇదే అని పేర్కొన్న శ్రీసిటీ ఎండీ, ఈ పర్యటనను తాము అత్యంత గౌరవప్రదంగా భావిస్తున్నామని అన్నారు. అలాగే డా. హరిబాబుతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. శ్రీసిటీ మరింత అభివద్ధికి గవర్నర్‌ విలువైన సూచనలు, సలహాలకు కతజ్ఞతలు తెలిపారు. శ్రీసిటీలోని పరిశ్రమల సీఈఓ ల సమావేశంలో గవర్నర్‌ మాట్లాడుతూ, తన పర్యటన ఉద్ద్యేశ్యాన్ని వారికి వివరించారు. దశలవారీగా అర్హత కలిగిన మిజోరాం యువతకు ఉద్యోగ, నైపుణ్యాభివద్ధి అవకాశాలను కల్పించడం తన ప్రాధాన్యత అంశంగా ఆయన స్పష్టం చేశారు. శ్రీసిటీ అద్భుతమైన మౌళిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని కొనియాడిన ఆయన, గతంలో వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దిన డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి కషి, అంకితభావాన్ని అభినందించారు. భారత ప్రభుత్వం నినాదమైన ‘ఆత్మనిర్భరత భారత్‌’ కు మద్దతుగా రక్షణ, అంతరిక్ష రంగాల పరికరాల తయారీ పరిశ్రమల స్థాపనపై దష్టి సారించి, అందుకోసం శ్రీసిటీలో ప్రత్యేక జోన్‌ ఏర్పాటు కోసం పరిశీలించాలని శ్రీసిటీ ఎండీకి ఆయన సూచించారు.ఉపాధి కల్పన, నైపుణ్యాభివద్ధిపై శ్రీసిటీ దష్ఠిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ వివిధ రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన మరియు స్థానిక యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు పరిశ్రమలతో కలసి చేస్తున్న కషిని కొనియాడారు.మిజోరాం ప్రభుత్వ అధికారుల బందంతో కలిసి డైకిన్‌ పరిశ్రమలో నెలకొల్పిన నైపుణ్యాభివద్ధి కేంద్రాన్ని ఆయన సందర్శించి, అక్కడ నిపుణులతో చర్చించారు. మిజోరాం యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో కొన్ని రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలతో జరిపిన చర్చలు మిజోరాం యువత సాధికారత పట్ల గవర్నర్‌ నిబద్ధతను చాటి చెప్పింది. పర్యటనలో భాగంగా శ్రీసిటీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కళాశాలను సందర్శించి, విద్యా అవకాశాలు, ఆవిష్కరణలపై అక్కడ విద్యార్థులు అధ్యాపకులతో చర్చలు జరిపారు.గవర్నర్‌ బందంలోని మిజోరాం యూత్‌ కమిషన్‌ చైర్మన్‌, కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, ప్రభుత్వ ఐటీఐ, ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌, సైన్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు ఒకరోజు ముందుగానే శ్రీసిటీ విచ్చేసి, ఇక్కడ నైపుణ్యాభివద్ధి, ఉపాధి అవకాశాల గురించి సంబంధిత అధికారులతో సమావేశమై పలు వివరాలను సేకరించారు.

➡️