సమాజాభివృద్ధిలో మహిళా బాధ్యత కీలకంప్రజాశక్తి- తిరుపతి సిటి: సమాజాభివృద్ధిలో మహిళల బాధ్యత చాలా కీలకమని తిరుపతి కార్పొరేషన్ మేయరు డాక్టర్ శిరీషా తెలిపారు. ప్రముఖ బిఎన్‌ఐ కాంపియన్ మొదటి చాప్టర్ (తిరుపతి) ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు డాక్టరు పి.శ్రావణ కుమార్ రెడ్డి అధ్యక్షతన మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వివాహాభోజనం ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి తిరుపతి మేయరు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈసందర్బంగా మేయర్ మాట్లాడుతూ మహిళలు ఆదర్శంగా ఉండాలన్నారు. సమాజ అభివృద్ధి మహిళల చేతుల్లోనే ఉందని, తమ పిల్లలను బాగా పెంచితే సమాజం బాగుంటుందని సూచించారు. పాఠశాలల్లో కూడా మార్కుల కాకుండా విలువలు, విజ్ఞానాన్ని పెంచేలా చదువు ఉండాలని, అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. ఉమెన్ ఎన్‌ఫవర్‌మెంట్ ఇంకా పుల్‌ఫిల్ కాలేదని అభిప్రాయపడ్డారు. ఆడ, మగ ఇద్దరు ఒకర్నిఒకరు ప్రోత్సహించుకుని ముందుకు వెళ్లితే సమసమాజం ఏర్పడుతుందన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇటీవల ఆర్మిలో సైతం సైనాధికారిగా మహిళలు నియమింపడ్డారని, ఇది శుభపరిణామం అన్నారు. అ సంస్థ అధ్యక్షులు డాక్టరు శ్రావణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 18 నెలల క్రితం బిఎన్‌ఐ కాంపియన్ మొదటి చాప్టర్ ఏర్పడిందన్నారు. స్థానంగా ఉన్న రకరకాల వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు ఒకటిగా ఏర్పడి, వారి బిజినెస్‌లను విస్తృత పరచడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు 80మంది సభ్యులు ఇందులో ఉన్నారని తెలిపారు. 23 కోట్ల రూపాయలు తిరుపతి చాప్టర్ ద్వారా లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. అనంతరం తమ చాప్టర్‌లో ఉన్న 14 మంది మహిళా వ్యాపారవేత్తలను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్కరించారు. కార్యక్రమంలో పి.సుబ్రమణ్యం, డాక్టరు కామిశెట్టి నరేంద్రకుమార్, మణికంఠరెడ్డి, కీర్తి, అపర్ణ, నీరజ, చంద్రశ్రావణి, హర్షితారెడ్డి పాల్గొన్నారు.
