స్పార్క్-2024 విజేతగా అక్షితప్రజాశక్తి-తిరుపతి(మంగళం):తిరుపతి నగర పరిధిలోని ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ తతీయ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులకు స్పార్క్-24 పేరిట స్పీచ్ కాంపిటీషన్ ను నిర్వహించగా స్పార్క్-2024 విజేతగా బీకాం విద్యార్థిని అక్షిత నిలిచారు. 150 మంది విద్యార్థిని విద్యార్థులు వీడియో ప్రజెంటేషన్, ఎక్స్టెంపోర్, గ్రూప్ డిష్కషన్ తదితర విభాగాలలో విద్యార్థులు తమ ప్రతిభను చూపి 17 మంది ఫైనల్స్ కు అర్హత సాధించారని కళాశాల సంచాలకులు గిరిధర్, విశ్వనాథ్ లు తెలిపారు. అంతిమ పోటీలలో ప్రతి విద్యార్థి నేటి ప్రపంచ పరిస్థితులు, ప్రకతి పరిరక్షణ, నీటి ప్రాముఖ్యత, మంచి అలవాట్లు, చైల్డ్ లేబర్ వంటి అంశాలను తెలియజేశారు. మొదటి స్థానంలో నిలిచిన అక్షిత కు 5 వేల రూపాయల నగదుతో పాటు, ఉత్తమ ప్రశంసా పత్రం, షీల్డ్, ద్వితీయ స్థానంలో ఋక్సాణకు రూ.3000, తతీయ స్థానంలో శ్రావణి వెయ్యి రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, షీల్డ్ ను కళాశాల సంచాలకులు గిరిధర్, విశ్వనాథ్ లచే అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు మాట్లాడుతూ తమ విద్యార్థుల భవిష్యత్ ను దష్టిలో వుంచుకుని వారు అత్యున్నతంగా స్థిరపడాలని ఇటువంటి వినూత్న కార్యక్రమాలు ప్రతి ఏడు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల న్యాయ నిర్మేతగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీరామ్ బాబు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపసంచాలకులు మునిరత్నం, ప్రిన్సిపాల్ జాఫర్వల్లీ, అధ్యాపకులు సుధాకర్, భానుకిరణ్, గ్రేస్ వినీల, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
