స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచండి : సిఐటియుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌స్విమ్స్ ఆసుత్రిలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని శనివారంఉదయం కార్మికులు టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు .సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో స్విమ్స్ కు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో కరుణాకర్ రెడ్డి నివాస గహం వద్ద ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు.స్విమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న తమను లక్ష్మీ శ్రీనివాసా కార్పొరేషన్ లో కలిపారని, టీటీడీలోని అన్ని విభాగాల్లో కార్పొరేషన్ కార్మికులకు వేతనాలు పెంచి తమకు పెంచక పోవటానికి కారణమేమిటని ప్రశ్నించారు. వేతనాలు పెంచి, హౌదాలను మార్పు చేయడం ద్వారా తమకు లబ్ధి చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. స్విమ్స్ యాజమాన్యంలో కొందరు అదే పనిగా వేధింపులకు పాల్పడుతున్నారని వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తామని, వేతనాలు పెంచుతామని కరుణాకర్ రెడ్డి కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ యూనియన్ నాయకులు రవి, సూరి, ముత్తు తదితరులు పాల్గొన్నారు.
