శ్రీవారి దర్శనానికి 12గంటలు

శ్రీవారి దర్శనానికి 12గంటలుప్రజాశక్తి -తిరుమల వేసవి సెలవులు ముగియనుండడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 78,064 మంది భక్తులు దర్శించుకోగా 33,869 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.70కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం 11వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్‌ రామానుజాచార్యులు, అనంత గోపాలకష్ణ, డాక్టర్‌ మారుతి శ్లోక పారాయణం చేశారు.

➡️