16న గ్రామీణబంద్‌ను జయప్రదం చేయండిరైతుసంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్‌

16న గ్రామీణబంద్‌ను జయప్రదం చేయండిరైతుసంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్‌

16న గ్రామీణబంద్‌ను జయప్రదం చేయండిరైతుసంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్‌ప్రజాశక్తి – బుచ్చినాయుడు కండ్రిగ అఖిల భారత సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపు మేరకు ఈనెల 16న జరగనున్న గ్రామీణ భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్‌ పిలుపునిచ్చారు. సోమవారం బిఎన్‌ కండ్రిగలో రైతుసంఘం, సిఐటియు, ఎఐటియుసి, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త సమావేశం జరిగింది. దాసరి జనార్ధన్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు నల్లచట్టాలను రద్దు చేస్తామని పార్లమెంట్‌లో ప్రకటించినా దొడ్డిదారిన అమలు చేస్తోందన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌చేశారు. కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ రంగంలో చొరబడకుండా రైతులకు మేలు చేసినపుడే స్వామినాతన్‌కు నిజమైన నివాళని తెలిపారు. ఉపాధి హామీ నిధులను తగ్గిస్తూ పేదల కడుపు కొడుతున్నారని విమర్శించారు. రమేష్‌, రమణయ్య, కత్తిధర్మయ్య, మురళి, మణి, పోలయ్య, పద్మ, చంద్రమ్మ, మారయ్య పాల్గొన్నారు. గూడూరు టౌన్‌లో.. గడియారం స్తంభం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సమ్మెను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. నాయకులు జోగిశివకుమార్‌, రమణయ్య, సురేష్‌, అడపాల ప్రసాద్‌, వెంకటరామిరెడ్డి, కాలేషా ప్రభాకర్‌ పాల్గొన్నారు.

➡️