జిల్లా గ్రీవెన్స్‌ త్రిసభ్య కమిటి ద్వారారూ.35.58లక్షలు నగదు విడుదలఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తేకఠిన చర్యలు తప్పవు : కలెక్టర్‌

జిల్లా గ్రీవెన్స్‌ త్రిసభ్య కమిటి ద్వారారూ.35.58లక్షలు నగదు విడుదలఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తేకఠిన చర్యలు తప్పవు : కలెక్టర్‌ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : సాధారణ ఎన్నికలు లోక్‌సభ, శాసనసభ 2024 షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై అందిన వివిధ ఫిర్యాదుల పరిష్కారం కొరకు చర్యలు తీసుకున్నామని సదరు నివేదికను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం వరకు నివేదికల మేరకు ప్రింట్‌ మీడియా ద్వారా 253 ఫిర్యాదులు అందగా 251 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని మిగిలినవి పురోగతిలో ఉన్నాయనిపేర్కొన్నారు. కంప్లైంట్‌ మానిటరింగ్‌ యాప్‌, సీఈవో ద్వారా 47 ఫిర్యాదులు అందగా 47 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, పోలీసు ఎన్ఫోర్స్మెంట్‌ టీమ్స్‌ ద్వారా చేపట్టిన సీజర్‌ మేనేజ్మెంట్‌ ప్రక్రియ ద్వారా కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి (14.4.2024) వరకు..జిల్లా వ్యాప్తంగా రూ.67.81లక్షలు మేర నగదు, 4713 లీటర్లు విలువ రూ.22.58 లక్షల లిక్కర్‌, ఇతర వస్తువులను కలిపి మొత్తం రూ.3.38కోట్లు సీజ్‌ చేయడం జరిగిందన్నారు. సి-విజిల్‌ ద్వారా అందిన ఫిర్యాదులు నేటి వరకు మొత్తం 600 కాగా అందులో సరియైన ఫిర్యాదులు 457కుహాజరై పరిష్కరించడమైనదని అన్నారు. ఫిర్యాదు పరిష్కార సరాసరి సమయం సుమారు 31.26 గంటలుగా ఉందని తెలిపారు. 143 ఫిర్యాదులు నిరాధారమైనవిగా గుర్తించామని తెలిపారు. ఎన్‌జి ఎస్పీ పోర్టల్‌ ద్వారా అందిన ఫిర్యాదులు 676 లో 659 పరిష్కరించడం జరిగిందని తెలిపారు. అలాగే ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 23మంది వాలంటీర్లను తొలగించడం జరిగిందన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలలో భాగంగా 7మందిని సస్పెండ్‌ చేయడమైనదని, ఒకరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్స్‌ చేయడం జరిగిందని, ఒకరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 7మందిని సర్వీసు నుండి తొలగించడం జరిగిందని, ఒకరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా నేటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై ఏర్పాటు చేసిన అనధికార ప్రకటనలు 30,861 తొలగింపు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే డిస్ట్రిక్ట్‌ గ్రీవెన్స్‌ త్రిసభ్య కమిటీ ద్వారా సామాన్య ప్రజలకు, వ్యాపారులకు చెందిన సీజ్‌ చేసిన నగదు 23 కేసులలో రూ. 42,68,380ని సమీక్షించి నేటి వరకు 20కేసులకు సంబంధించిన మొత్తం రూ.35,58,580లను సంబంధీకులకి తిరిగి అందజేయడం జరిగిందని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు ఉంటే చర్యలు తప్పవని వెల్లడించారు.ఉపాధి హామీ పథకం కూలీలకు పనిప్రదేశాల వద్ద సౌకర్యాలు కల్పించేందుకు ద్వామా పిడి దష్టికి తీసుకువెళ్లి సకాలంలో సమస్యలు పరిష్కరిస్తాం. వేసవిలో కూలీల పట్ల ప్రత్యేకమైన చర్యలు చేపడతాం.

➡️