విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు
ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా): పిచ్చాటూరు మండలం జిల్లా ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం గత టిడిపి ప్రభుత్వంలో 60 శాతం పనులు పూర్తి చేయగా వైసీపీ ప్రభుత్వంలో మిగిలిన 40% పనులు చేయుటకు నిధులు లేక ఆగిపోయినది అటువంటిది ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం ఎంతో అవసరమని మిగిలిపోయిన 40 శాతం పనులు కాను 38.50 లక్ష రూపాయలు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో నిధులు జిల్లా అధికారులు మంజూరు చేశారు. గురువారము ఉదయము 10 గంటలకు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణములో మంజూరైన నిధులకు ప్రహరీ గోడ కోసం మాజీ మార్కెటింగ్ చైర్మన్ డి. ఇలగోవన్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఎంతో ముందు చూపుతో చదువుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని గ్రహించి పాఠశాల అభివృద్ధి కోసం, వెల్లుల్ల భవిష్యత్తు కోసం ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణము, కొరత ఉన్న విద్యార్థుల కోసం అదనపు గదులు నిర్మించడం ఎంతో అవసరమని ఇవి కూటం ప్రభుత్వ విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రభాకర్ రాజు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ, పద్దు రాజు, ఎంఈఓ యుగంధర్ రాజు, జయ చంద్ర నాయుడు, చైర్మన్ రవి, వాసు,ప్రధాన ఉపాధ్యాయుడు గిరి ప్రకాష్,పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ వినాయగం, ఎమ్మెస్ రవి, చిన్న, ఢిల్లీ, రజిని, ప్రధానోపాధ్యాయులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.