78 మంది ఫార్మసీ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక

78 మంది ఫార్మసీ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక

78 మంది ఫార్మసీ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికప్రజాశక్తి -రామచంద్రాపురం: మండలంలోని వెంకట్రామాపురం సెవెన్‌ హిల్స్‌ ఫార్మసీ కళాశాలలో ఒమేగా హెల్త్‌ కేర్‌ ప్రతినిధులు విజయ శేఖర్‌ తరుణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలో సెవెన్‌ హిల్స్‌ ఫార్మసీ విద్యార్థులు 78 మంది చెన్నై కు చెందిన ఒమేగా హెల్త్‌ కేర్‌ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నిరంజన్‌ బాబు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికకు వివిధ కళాశాలల నుండి బి ఫార్మసీ, ఫార్మా డీ, ఎం ఫార్మసీ విద్యను అభ్యసిస్తున్న చివరి సంవత్సరానికి చెందిన 110 మంది విద్యార్థులు హాజరయ్యారు. నియామకపు ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు రాత, సాంకేతిక, వ్యక్తిత్వ, మౌఖిక పరీక్షలు నిర్వహించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఒమేగా హెల్త్‌ కేర్‌ ప్రతినిధి విజరు శేఖర్‌ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.2లక్షల35వేలు వేతనంగా నిర్ణయిస్తూ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రాంగణ నియామకాలలో ఎంపికైన సెవెన్‌ హిల్స్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులకు కరస్పాండెంట్‌ ఎం సుమలత, కళాశాల బోధన, బోధనేత సిబ్బంది అభినందనలు తెలిపారు.

➡️