ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని కాపు వీధి నందు గల స్వామి వివేకానంద పాఠశాలలో విద్యార్థులచే తయారు చేయబడిన ఎI రోబోటిక్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ప్రైవేటు విద్యాసంస్థల రీజినల్ జోనల్ ప్రెసిడెంట్ విశ్వనాధ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ ఓబుల రమణారెడ్డి, సాయి జ్యోతి కళాశాల కరెస్పాండెంట్ రమేష్ హాజరు. ఈ సందర్భంగా ఆయన. మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సాంకేతికత అవసరం అని తెలియజేశారు. అందుకు అనుగుణంగా విద్యార్థి దశలో నుంచే ఎ I సాంకేతికత ను తెలియజేయడం అభినందనీయం తెలియజేశారు అనంతరం అతిథులను పాఠశాల కరస్పాండెంట్ సదాశివం. డైరెక్టర్ సాహిత్య ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
