ట్రైనీ డ్రాక్టర్‌పై అత్యాచారం చేసిన వారిపై చర్య తీసుకోవాలికన్నెర్రశ్రీ ఏరియా ఆస్పత్రుల్లో నిరసనల వెల్లువ భారీ బైక్‌ర్యాలీలు, మానవహారాలు, వినతులు

ట్రైనీ డ్రాక్టర్‌పై అత్యాచారం చేసిన వారిపై చర్య తీసుకోవాలికన్నెర్రశ్రీ ఏరియా ఆస్పత్రుల్లో నిరసనల వెల్లువ భారీ బైక్‌ర్యాలీలు, మానవహారాలు, వినతులు

ట్రైనీ డ్రాక్టర్‌పై అత్యాచారం చేసిన వారిపై చర్య తీసుకోవాలికన్నెర్రశ్రీ ఏరియా ఆస్పత్రుల్లో నిరసనల వెల్లువ భారీ బైక్‌ర్యాలీలు, మానవహారాలు, వినతులుప్రజాశక్తి – యంత్రాంగం కలకత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రాత్రి డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి, పాశవికంగా హత్య చేసిన కేసులో కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. తిరుపతిలో జూనియర్‌ డాక్టర్లు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్విమ్స్‌ నుంచి ఎస్‌వి మెడికల్‌ కళాశాల, కార్పొరేషన్‌ కార్యాలయం, నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌, జ్యోతి థియేటర్‌, క్రైం, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌, మహతి ఆడిటోరియం, ప్రకాశం రోడ్డు, బాలాజీ కాలనీ, ఎస్వీ యూనివర్సిటీ వరకూ ర్యాలీ సాగింది. అఘాయిత్యానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అమీర్న్‌, డాక్టర్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ రెడ్డి, శరత్‌ చంద్ర పాల్గొన్నారు. తిరుపతి ఎంఆర్‌పల్లి సర్కిల్‌ నుంచి అన్నమయ్య సర్కిల్‌ వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు అక్బర్‌, నవీన్‌ మాట్లాడుతూ ఘటన జరిగి ఎనిమిది రోజులు గడుస్తున్నా కేసులో ఎటువంటి పురోగతి లేదని, తూతూమంత్రంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సిఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు వినోద్‌, నరేంద్ర, బాల, వీరేష్‌, వినరు, ఓంరాజు, మంజుల పాల్గొన్నారు. జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న నిరరసనకు ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.జయంతి, డాక్టర్‌ పి.సాయిలక్ష్మి సంఘీభావం ప్రకటించారు. అఘాయిత్యానికి పాల్పడిన ముద్దాయిలను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది మరో నిర్భయ ఘటనను తలపిస్తోందన్నారు. చంద్రగిరి టవర్‌క్లాక్‌ వద్ద నిరసన కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ పాల్గొన్నారు. నారావారిపల్లి, కొటాల పిహెచ్‌సిల వైద్యు సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు చంద్రమోహన్‌, శ్రీ సత్య, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.గూడూరు ఏరియా ఆస్పత్రి వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ షరీనా మాట్లాడుతూ డాక్టర్లు లేకపోతే సమాజం ఉండదని, ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఈ నిరసనలో డాక్టర్లు మైధిలి, రాజా ,హరికష్ణ ,జనార్దన్‌ రెడ్డి, రోహిణి, స్వరాజ్యం పాల్గొన్నారు. సత్యవేడు సిహెచ్‌సి, పిహెచ్‌సి వైద్యులు, హెల్త్‌కేర్‌ వర్కుర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంఆర్‌ఒ టివి సుబ్రమణ్యంకు వినతిపత్రం సమర్పించారు. సత్యవేడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సురేష్‌, డాక్టర్‌ మానస, హరిప్రసాద్‌, సోహైల్‌, చిన్న పాండురు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిత పాల్గొన్నారు. పుంగనూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో బిజెపి రాజంపేట పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు ఆర్‌కె అయూబ్‌ఖాన్‌ ఓ ప్రకటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్వేటినగరం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ గోపీనాధ్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నగర వీధుల్లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు భాగ్యలక్ష్మి, శతీబాఘ్యం. దివ్య పాల్గొన్నారు. సదుం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పుష్పకుమారి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విజయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. వైధ్యాధికారులు సోమశేఖర్‌, విష్ణుప్రియ పాల్గొన్నారు.శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి వద్ద నిరసన తెలిపారు. నిందితులు ఎవరో స్పష్టమవుతున్నా చర్యల్లో జాప్యం ఎందుకు అర్ధం కావడం లేదని డాక్టర్లు ప్రశ్నించారు. స్థానిక ఎహెచ్‌లోనూ పోలీసు ఔటపోస్టును ఏర్పాటు చేయాలని కోరారు. పుత్తూరు ఆస్పత్రి వద్ద వైద్యులు, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కృష్ణకాంత్‌ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యిందన్నారు. మెడికల్‌ కాలేజీలో సిసి కెమెరాలు పనిచేయకపోవడం దారుణమన్నారుర. ప్రభుత్వ హాస్పిటల్‌ డాక్టర్లు పల్లవి, అశోక్‌ వర్ధన్‌, నీలి ఉదరు, ధనుష్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి, నాయుడుపేట పోలీసు స్టేషన్‌ వద్ద డాక్టర్లు నిరసన తెలిపారు. ఎస్‌ఐకు వినతిపత్రం సమర్పించారు. డాక్టర్లు హరిప్రియ, చంద్రకళ, రామసుబ్బయ్య, వెంగయ్య చైతన్యస్రవంతి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఐఎంఎ నేతృత్వంలో జిల్లా ప్రధాన ఆస్పత్రి ముందు డాక్టర్లు చేపట్టిన నిరసనకు ఎంఎల్‌ఎ గురజాల జగన్మోహన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బంగారుపాళ్యం జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ప్రధాన వైద్యురాలు శిరీష, వైద్యులు జ్యోతి స్వరూప, విజరు కుమారి, శాలిని పాల్గొన్నారు. శాంతిపురంలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్లు శివకుమారి,ఉషారాణి, వంశీకష్ణ, ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️