అన్ని వర్గాల ప్రజలకు చెందినగొప్ప వ్యక్తి అంబేద్కర్‌చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌

అన్ని వర్గాల ప్రజలకు చెందినగొప్ప వ్యక్తి అంబేద్కర్‌చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌

అన్ని వర్గాల ప్రజలకు చెందినగొప్ప వ్యక్తి అంబేద్కర్‌చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ అన్ని వర్గాల ప్రజలకు చెందిన గొప్ప వ్యక్తిని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విజరు, మణికంఠ ఛందోలు, డిఆర్‌ఓ బి.పుల్లయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డిడి డాక్టర్‌ రాజ్యలక్ష్మి, నగర పాలక సంస్థ కమీషనర్‌ డాక్టర్‌ జె.అరుణ, దళిత, గిరిజన సంఘాల నాయకులతో కలసి భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ సూచించిన మార్గంలో ఆయన ఆశయాలను నెరవేస్తు నేటి యువత మే 13న పోలింగ్‌ రోజు చిత్తూరు పట్టణంలోని ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకొవాలని కోరారు. దర్గా సర్కిల్‌ నుండి ఎమ్మెస్సార్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. గృహనిర్మాణ సంస్థ పిడి పద్మనాభం, ఏఎస్పీ, డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

➡️