రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన పుత్తూరు రూరల్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. రూరల్‌ మండలం తడుకు ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్యలో గల కెయం నెంబర్‌ 115/15-13 పోస్టల్‌ మధ్య మంగళవారం తెల్లవారు జామున 30-35 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మతి చెందింది. పింక్‌ కలర్‌ జాకెట్టు, పచ్చ కలర్‌ చీర, కుడి దవడ కింద నల్లటి పుట్టుమచ్చ వంటి ఆనవాళ్లు వున్నాయని రైల్వే పోలీసులు తెలిపారు. రేణిగుంట రైల్వే ఎస్‌ఐ తమ సిబ్బంది వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిస్తే రేణిగుంట రైల్వే పోలీసులు 9963126343, 9440755983 ఫోను నెంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.

➡️