స్మార్ట్‌ మీటర్లపై అవగాహన అవసరంఎపిఎస్‌ పిడిసిఎల్‌ సిఎండి కె. సంతోష రావు

Oct 9,2024 00:22
స్మార్ట్‌ మీటర్లపై అవగాహన అవసరంఎపిఎస్‌ పిడిసిఎల్‌ సిఎండి కె. సంతోష రావు

స్మార్ట్‌ మీటర్లపై అవగాహన అవసరంఎపిఎస్‌ పిడిసిఎల్‌ సిఎండి కె. సంతోష రావుప్రజాశక్తి- తిరుపతి సిటీ : విద్యుత్‌ వినియోగదారులు స్మార్ట్‌ మీటర్లపై అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఎపిఎస్‌పిడిసిఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.సంతోషరావు పేర్కొన్నారు. తిరుపతిలో ఎపిఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్మార్ట్‌ మీటర్లపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ పరిధిలో వాణిజ్య, పారిశ్రామిక సర్వీసులకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వినియోగదారులను చైతన్యవంతం చేసేందుకు వీలుగా గోడపత్రిక, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎండి సంతోషరావు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ హెచ్‌టి సర్వీసులకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తు స్మార్ట్‌ మీటర్లదేనని, స్మార్ట్‌ మీటర్ల వినియోగానికి వినియోగదారులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్మార్ట్‌ మీటర్ల ద్వారా వినియోగదారులు ఎప్పటికప్పుడు వినియోగాన్ని తెలుసుకోవచ్చని, విద్యుత్‌ పొదుపు ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్లు (ఎఫ్‌ఎసి) పి.అయుబాఖాన్‌, వై.లక్ష్మీనరసయ్య, జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.వేణుగోపాల్‌ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజేంద్రప్రసాద్‌, ఆదాని సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️