దొంగ ఓట్లను అడ్డుకుంటాం: ఆరణి

దొంగ ఓట్లను అడ్డుకుంటాం: ఆరణి

దొంగ ఓట్లను అడ్డుకుంటాం: ఆరణి ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లను అడ్డుపెట్టుకుని గెలవాలని చూస్తున్నారని, తప్పకుండా దొంగ ఓట్లను అడ్డుకొని గెలుపొందుతామని ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి నగర పరిధిలోని జీవకోన ప్రాంతంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా శివ అతని మిత్ర బందం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. వీరికి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవకోన ప్రాంతంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయిందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతాలు నచ్చి స్థానికంగా ఉన్న యువత పెద్ద సంఖ్యలో పార్టీకి అండగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, తిరుపతి నగరంలో పెచ్చు మీరిన గంజాయి అమ్మకాలను, భూకబ్జాలను, టిడిఆర్‌ బండ్ల భాగోతాలను తప్పకుండా బయటపెట్టి కారకులకు తగిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌, రాజమోహన్‌, రాజేష్‌ యాదవ్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️