‘సిరి అలా వెళ్లకే’ షూటింగ్‌ ప్రారంభం

‘సిరి అలా వెళ్లకే’ షూటింగ్‌ ప్రారంభంప్రజాశక్తి- తిరుపతి(మంగళం): షిలోక్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై జి9 ఫిలిం ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ సహాయ సహకారాలతో షీలా లోకనాథన్‌ నిర్మిస్తున్న ‘హే సిరి అలా వెళ్లకే’ వెబ్‌ సిరీస్‌ చిత్రం షూటింగ్‌ను ఆదివారం తిరుపతి నగర పరిధిలోని మనస సరోవర్‌ హోటల్‌ ప్రాంతంలో ప్రారంభించారు. ఈసందర్భంగా దర్శకులు క్రిస్టోఫర్‌, సినీ రచయిత భరత్‌ మాట్లాడుతూ హే సిరి అలా వెళ్లకే చిత్రం పూర్తిగా ప్రేమకథా చిత్రమని, విభిన్న కథాంశాలతో ఈచిత్రంలో హాస్యం, బావద్వేగాలతో కూడిన సన్నివేశాలను నూతనంగా చిత్రీకరించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచి పెట్టాలని ఉద్దేశంతో నిర్మిస్తున్నామన్నారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా సాయి, కథానాయికిగా షీలా లోకనాథన్‌ ముఖ్యపాత్రలో మౌనిక రాజ్‌, కామెడీ శాస్త్రి, వినుకొండ రవి, సుభాష్‌ చంద్రబోస్‌, గుర్రప్ప నాయుడు, భరణి కిరణ్‌, బేబీ అభిజ్ఞ, శోధన నటిస్తున్నారన్నారు. 32 రోజులపాటు తిరుపతి పరిసర ప్రాంతాలలో ఈ వెబ్‌ సిరీస్‌కు చెందిన చిత్రాన్ని చిత్రీకరిస్తామని దర్శకులు క్రిస్టోఫర్‌ తెలిపారు.

➡️