మంగళంలో ఉద్రిక్తతకుటుంబ కలహాలతో దాడులు

మంగళంలో ఉద్రిక్తతకుటుంబ కలహాలతో దాడులు

మంగళంలో ఉద్రిక్తతకుటుంబ కలహాలతో దాడులుప్రజాశక్తి- తిరుపతి(మంగళం): మంగళం పరిధిలోని సప్తగిరి కాలనీ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌ వసంతు అశోక్‌ కుమార్‌ రెడ్డి, ఆయన చిన్నాన్న లక్కిరెడ్డి మధ్య ఉన్న కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం మంగళంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జరిగిన లావాదేవీలను లక్కిరెడ్డి సంబంధించిన వారు అశోక్‌ కుమార్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి అడగడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్థానిక సమాచారం. లక్కిరెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి, సుదర్శన్‌ రెడ్డితో కలిసి అశోక్‌ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కారు అద్దాలు పగలగొట్టారని, తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని అశోక్‌ కుమార్‌ రెడ్డి తిరుచానూరు పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో తిరుచానూరు పోలీసులు మంగళంకు చేరుకొని ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. లక్కిరెడ్డి కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని సిఐ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఈఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతుందని సీఐ శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. ఈ దాడుల విషయం తెలుసుకున్న చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళం సప్తగిరి కాలనీకి చేరుకోవడంతో పోలీసులు సద్దిచెప్పి పంపేశారు. కాగా మళ్లీదాడులు పునరావత్తం కాకుండా సాయుధ దళాలు మంగళంలో పహారా కాస్తున్నాయి. కాగా ఉప సర్పంచ్‌ అశోక్‌ కుమార్‌ రెడ్డి వైసీపీకి మద్దతుదారుడుగా ఉండడం, లక్కిరెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేశారు. దీంతో జరుగుతున్న దాడులకు కుటుంబ కలహాల తంతుకు రాజకీయ రంగు పులుముకుంది.

➡️