ఆటోవాలాల దాతృత్వం డ్రైవర్‌ బిడ్డకు ఆర్థిక భరోసారూ.లక్ష 7వేలు… రూ.2.60 లక్షలుగామెచ్యూరిటీ డబ్బు వర్షితకు అందజేత

ఆటోవాలాల దాతృత్వం డ్రైవర్‌ బిడ్డకు ఆర్థిక భరోసారూ.లక్ష 7వేలు... రూ.2.60 లక్షలుగామెచ్యూరిటీ డబ్బు వర్షితకు అందజేత

ఆటోవాలాల దాతృత్వం డ్రైవర్‌ బిడ్డకు ఆర్థిక భరోసారూ.లక్ష 7వేలు… రూ.2.60 లక్షలుగామెచ్యూరిటీ డబ్బు వర్షితకు అందజేతప్రజాశక్తి-తిరుపతి(మంగళం)సాయం అంటే ఇలా ఉండాలి.. తమ తోటి ఆటోడ్రైవర్‌ కుటుంబం ఇక లేదన్న వార్త విని తల్లడిల్లిపోయారు.. దంపతుల కూతురు వర్షితకు ఆర్థిక సాయం చేయాలని తలచారు. తిరుపతి నగర పరిధిలోని రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న సుదర్శన్‌ ఆటో స్టాండ్‌కు చెందిన ఆటోవాలాలు తమవంతు సాయంగా 103 మంది కలిసి విరాళాలు సేకరించి లక్ష 7వేలు సేకరించారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ప్రస్తుతం 11 ఏళ్ల తరువాత మెచ్యూరిటీ అయిన సొత్తును వర్షితకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో అందజేశారు. స్ఫూర్తిదాయక ఘటన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో డ్రైవర్‌ సిద్దయ్య అతని భార్య లక్ష్మీదేవి మరణించారు. వారికి ఒక పాప సంతానం. ఈ సమాచారాన్ని అందుకున్న తిరుపతి నగర పరిధిలోని రైల్వే స్టేషన్‌ వద్దనున్న సుదర్శన్‌ ఆటో స్టాండ్‌ కు చెందిన ఆటోవాలాలు తమ వంతుగా సాయం అందించాలని ఆటో స్టాండ్‌ లోని 103 మంది సభ్యులు ప్రతినబూనారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతట సైకిల్‌ పై సుదర్శన్‌ ఆటో స్టాండ్‌ ఆధ్వర్యంలో తిరుగుతూ విరాళాలు సేకరించి లక్ష 7వేల రూపాయలను చనిపోయిన డ్రైవర్‌ పాప రెడ్డి వర్షిత పేరుతో ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేశారు. 11 సంవత్సరాల క్రితం వేసిన ఫిక్సెడ్‌ మెచ్యూరిటీ సమయం జరిగి రూ.2.60 లక్షలుగా వచ్చాయన్నారు. ఈ పూర్తి నగదును కలికిరి సమీపంలోని గ్రామంలో నిర్మలమ్మ(రెడ్డివర్షిత అమ్మమ్మ) సంరక్షణలో ఉన్న రెడ్డివర్షిత(14)కు గురువారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ వేదికగా సుదర్శన్‌ ఆటో స్టాండ్‌ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ కోడూరు బాలసుబ్రమణ్యం చేతుల మీదుగా ఆ నగదును అందించారు. పాప రెడ్డి వర్షిత ఉన్నత చదువులు కోసం దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు సాటి డ్రైవర్‌ కుటుంబానికి చేసిన ఈ ఉన్నత సహాయం చాలా గొప్పదన్నారు. రెడ్డివర్షిత ఏ చదువు చదువుతుందో దానికి అయ్యే పూర్తిఖర్చు మొత్తం తన ట్రస్టు ద్వారా భరిస్తామని హామీ ఇచ్చారు. ఇంతే కాకుండా దేశంలో ఎటువంటి విపత్తు వచ్చిన మొదట సహాయం చేసే చేతులుగా ముందుకు వచ్చేది సుదర్శన్‌ ఆటో స్టాండ్‌ ఆటోవాలాలన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని సందర్శించే యాత్రికులు ఏదేని ఆటోల్లో వస్తువులు జారవిడుచుకుంటే ఎంతో నిజాయితీగా ఈ ఆటో స్టాండ్‌ కు చెందిన సభ్యులు సంబంధిత పోలీస్‌ స్టేషన్లో ఆ వస్తువులను అప్పగించడం జరుగుతోందన్నారు. నిబద్ధత కలిగిన ఆటో యూనియన్‌ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్‌ నాయకులు ఐఎస్‌ ఖాజా, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️