తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం

Nov 30,2024 21:20 #politics, #Tirumala, #ttd
  • నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

ప్రజాశక్తి- తిరుమల : తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టిటిడి నిర్ణయించింది. నిత్యం గోవింద నామాలతో మారుమోగే తిరుమలలో గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేసే రాజకీయ నాయకులలో కొంతమంది దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని, ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టిటిడి బోర్డు ఇటీవల తీర్మానించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండి టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

➡️