గెలుపు ఓటములపై బెట్టింగ్‌లుకోట్లల్లోనే పందేలు కుప్పం మెజార్టీపై ఫోకస్‌

గెలుపు ఓటములపై బెట్టింగ్‌లుకోట్లల్లోనే పందేలు కుప్పం మెజార్టీపై ఫోకస్‌

గెలుపు ఓటములపై బెట్టింగ్‌లుకోట్లల్లోనే పందేలు కుప్పం మెజార్టీపై ఫోకస్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపోటములపై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే బెట్టింగ్‌రాయుళ్ల పందేలు ప్రారంభమైనా, పోలింగ్‌ తరువాత ఎక్కువయ్యింది. తిరుపతి జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, చిత్తూరు జిల్లాలో చిత్తూరు, నగరి నియోజకవర్గాలపై పెద్దఎత్తున బెట్టింగులు నడుస్తుండటం గమనార్హం. కుప్పంలో చంద్రబాబునాయుడు సాధించబోయే మెజార్టీపైనా పందేలు నడుస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్‌ స్థానంపైనా కారురాజా కారు అంటున్నారు. లక్షలు, కోట్లల్లోనే పందేలు పెద్దఎత్తున నడుస్తుండటం గమనార్హం. క్రికెట్‌ తరువాత రాజకీయాల్లోకి బెట్టింగులు ప్రవేశించాయి. చిత్తూరు జిల్లాలో ఒక్క తిరుపతి నుంచే జనసేన బరిలో నిలిచింది. ఇక్కడ ఆ పార్టీ తరఫున ఆరణి శ్రీనివాసులు పోటీ చేశారు. వైసీపీ నుంచి భూమన కరుణాకర్‌ రెడ్డి తనయుడు అభినయ రెడ్డి మొదటిసారి తన అదష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక్కడ హోరాహోరీ పోరు నడిచింది. రెండు పార్టీల నేతలూ ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ పోలింగ్‌ కేవలం 60 శాతానికే పరిమితం కావడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. మొత్తం రాయలసీమంతటా 75 శాతానికి పైగా పోలింగ్‌ నమోదవుగా ఒక్క తిరుపతిలోనే పోలింగ్‌ శాతం పడిపోయింది. దీంతో నరాలు తెగే టెన్షన్‌ రెండు పార్టీల నేతల్లోనూ కనిపిస్తోంది. చంద్రగిరిలోనూ ఇదే ఉత్కంఠ కనిపిస్తోంది. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తనయుడు మోహిత్‌ రెడ్డి వైసీపీ నుంచి బరిలో నిలవగా, టిడిపి తరఫున పులివర్తి నాని పోటీ చేస్తున్నారు. ఇక్కడ హోరాహోరీగా పోలింగ్‌ కొనసాగింది. చంద్రగిరి ఫలితం జిల్లా అంతటా ఆసక్తి కలిగిస్తోంది. దీంతో చంద్రగిరిలో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌ కొనసాగుతోంది. ఇక చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం విషయానికొస్తే ఇక్కడ రికార్డు స్థాయిలో 85శాతం పోలింగ్‌ నమోదయింది. చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో ఇక్కడ విజయం సాధిస్తారని టిడిపి నేతలు ధీమాగా ఉన్నారు. అయితే కుప్పం వైసిపి నేతల్లోనూ గెలుపుపై ఇదే ధీమా కనిపిస్తోంది. మొత్తం మీద కుప్పంలో చంద్రబాబు నాయుడు సాధించే మెజారిటీపైనే ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడుకు 50 వేలకు పైబడి మెజారిటీ వస్తుందని కొంతమంది పందెం కడుతుండగా, 30 వేలకు లోపే మెజారిటీ వస్తుందని మరి కొంతమంది పందేలు కాస్తున్నారు.నగరి నియోజకవర్గ విషయంలోనూ ఇదే తరహాలో పందాలు కొనసాగుతున్నాయి. మరోసారి గెలిచి రోజా ఇక్కడ హ్యాట్రిక్‌ కొడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండగా, రోజాకు ఘోర ఓటమి తప్పదని టిడిపి నేతలు గట్టిగా చెబుతున్నారు. నగరి రిజల్ట్‌ పై కూడా బెట్టింగ్లు నడుస్తున్నాయి. రాజంపేట పార్లమెంటు స్థానంపై కూడా ఇదే తరహాలో జోరుగా పందాలు నడుస్తున్నాయి. ఇక్కడ వైసిపి నుంచి పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా బిజెపి నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి బరిలో నిలిచారు. రాజంపేట పార్లమెంట్‌ స్థానం గెలుపోటములపైనా జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.

➡️