దుర్గమ్మ సేవలో బొజ్జల సుధీర్‌రెడ్డి

దుర్గమ్మ సేవలో బొజ్జల సుధీర్‌రెడ్డి

దుర్గమ్మ సేవలో బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దుర్గమును దర్శించుకున్న అనంతరం సుధీర్‌ రెడ్డికి ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలతో పాటు దుర్గమ్మ తీర్థప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన సుధీర్‌ రెడ్డి ఆ సందర్భంగా వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నారు. సుధీర్‌ రెడ్డితో పాటు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లినవారిలో శోభన్‌బాబు నాయుడు, కాసరం రమేష్‌, వజ్రం కిషోర్‌ తదితరులు ఉన్నారు.

➡️