కంట్రోల్ రూమ్ నంబర్ 0877 2256766
ప్రజాపిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
కమిషనర్ ఎన్.మౌర్య
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వలన భారీ వర్షాలు కురవనుండడంతో ప్రజలకు సహాయ చర్యలు అందించేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని కమిషనర్ ఎన్.మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూము నందు 24 గంటలు నగరపాలక సంస్థ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. తుఫాను వలన ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూము నంబర్ 0877 2256766 ను సంప్రదించాలని అన్నారు. సోమవారం నుండి నాలుగు రోజుల పాటు వర్షాలు ఎక్కువగా కురవనున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి సహాయక చర్యలకైనా కంట్రోల్ రూమును సంప్రదించాలని ప్రజలను కోరారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేశామని, ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి రావొద్దని కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
