ప్రశాంతంగా యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరీక్షలుపేపర్‌ 1 పరీక్షకు 55.71 శాతం,పేపర్‌ 2కు 55.80 శాతం మంది హాజరు

ప్రశాంతంగా యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరీక్షలుపేపర్‌ 1 పరీక్షకు 55.71 శాతం,పేపర్‌ 2కు 55.80 శాతం మంది హాజరు

ప్రశాంతంగా యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరీక్షలుపేపర్‌ 1 పరీక్షకు 55.71 శాతం,పేపర్‌ 2కు 55.80 శాతం మంది హాజరుప్రజాశక్తి- తిరుపతిటౌన్‌ యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌- 2024 పరీక్షలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ జరిగిందన్నారు. తిరుపతిలో నిర్వహించిన 3 పరీక్షా కేంద్రాలలో యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు 1199 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్‌ 1 పరీక్షకు 668మంది 55.71 శాతంగా, మధ్యాహ్నం పేపర్‌ 2 పరీక్షకు 669 మంది 55.80శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష పత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌ నుండి బందోబస్తు నడుమ సంబంధిత పరీక్ష కేంద్రాలకు తరలించడం జరిగిందని, అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని కలెక్టర్‌ తెలిపారు. కేంద్ర యుపిఎస్సి నిబంధనల మేరకు అన్నివిధాల పకడ్బందీ చర్యలు చేపట్టి పరీక్షలు నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

➡️