తిరుమలకు చేరుకున్న చీఫ్‌ సెక్రటరీ, డిజిపి

తిరుమలకు చేరుకున్న చీఫ్‌ సెక్రటరీ, డిజిపి

తిరుమలకు చేరుకున్న చీఫ్‌ సెక్రటరీ, డిజిపిప్రజాశక్తి – తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, డిజిపి ద్వారకా తిరుమల రావు చేరుకున్నారు. చీఫ్‌ సెక్రటరీకి టిటిడి ఈఓ జె.శ్యామలరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పద్మావతి అతిధి గహంలో సీఎస్‌ కు ప్రత్యేక వసతి ఏర్పాట్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. రేపు ఉదయం విఐపి దర్శన సమయంలో ఇరువురు స్వామివారి దర్శించుకుంటారని అధికారులు వెల్లడించారు. డిజిపికి పోలీసు అతిధి గహంలో బస ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘనస్వాగతం రేణిగుంట: తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌కు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌ ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ధ్యాన్‌ చంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్‌ అతిథి సింగ్‌, డిఆర్‌ఓ పెంచల్‌ కిషోర్‌, ప్రోటోకాల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ నాయుడు, ల్యాండ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామ్మోహన్‌, ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్‌ రెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

➡️