శ్రీవారి మెట్టు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి టీటీడీ ఈఓకు సీఐటీయు వినతి

శ్రీవారి మెట్టు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలిటీటీడీ ఈఓకు సీఐటీయు వినతి

శ్రీవారి మెట్టు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలిటీటీడీ ఈఓకు సీఐటీయు వినతిప్రజాశక్తి -తిరుపతి టౌన్‌గత 15 సంవత్సరాలుగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదలకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టిటిడి ఇఓ శ్యామలరావు కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు, సిఐటియు నేతలు సంయుక్తంగా టీటీడీ ఇఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. గత 62 రోజులుగా టీటీడీ పరిపాలన భవనం ఎదుట తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన దీక్షలు చేస్తున్నారని, తీవ్రమైన వర్షాలలో సైతం ఇబ్బందులు ఎదుర్కొంటూ దీక్షలు కొనసాగించారని మురళి గుర్తు చేశారు. 31 కుటుంబాలు శ్రీవారి మెట్టు మార్గాన్ని నమ్ముకుని ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు తోడ్పడుతూ తక్కువ ధరలతో ఆహార పానీయాలను అందిస్తూ టీటీడీకి, భక్తులకు 15 ఏళ్లుగా సేవలు చేస్తున్న వారిని, పులిని సాకుగా చూపి గతంలో వ్యాపారాలు నిలిపివేశారని, పోరాడి సాధించుకున్నప్పటికీ, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ నిలిపివేశారని, ఈ కారణంగా పేదల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఎదురైందని, వ్యాపారులు టిటిడి ఈఓకు మొరపెట్టుకున్నారు. గత 62 రోజులుగా టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా నిరసన దీక్షలో పాల్గొంటున్న తమ గురించి చర్చించి నిర్ణయం చేయకపోవడం సమంజసం కాదని, తమ కుటుంబాలకు న్యాయం చేయాలని విన్నవించారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌ జయచంద్ర, శ్రీవారి మెట్టు వ్యాపారుల సంఘం నేతలు మధు, చిట్టిబాబు, యుగంధర్‌ పాల్గొన్నారు.

➡️