కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలిసిఐటియు నిరసన ప్రదర్శ

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలిసిఐటియు నిరసన ప్రదర్శ

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలిసిఐటియు నిరసన ప్రదర్శనప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలంటూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన ప్రదర్శన, ధర్నా జరిగింది. తిరుపతిలో టిటిడి పరిపాలనా భవనం నుంచి పాత మున్సిపల్‌ కార్యాలయం వరకూ వందలాది మంది ఉద్యోగ కార్మికులతో నిరసన ప్రదర్శన జరిగింది. పాత మున్సిపల్‌ ఆఫీసు వద్ద జరిగిన ధర్నాకు జెఎసి ఛైర్మన్‌ గండికోట నాగ వెంకటేష్‌ అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ టైంస్కేల్‌, కంటింజెంట్‌, పార్ట్‌టైం, గెస్ట్‌, పీస్‌రేట్‌, గౌరవ వేతనం తదితర నాన్‌ రెగ్యులర్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. 2014 జూన్‌ ముందు నుండి నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఇతర వైద్య ఆరోగ్య స్కీముల్లో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు, మెడికల్‌ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో వయోపరిమితి ఇచ్చి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌, టీటీడీ సమగ్ర శిక్ష, స్విమ్స్‌, బర్డ్‌, రుయా, ఎస్వీయూ, వేదిక్‌, వెటర్నరీ, అగ్రికల్చర్‌, 108, 104, ఎలక్ట్రికల్‌, ఫారెస్ట్‌, టీటీడీ, అన్నమాచార్య, ఎన్‌. హెచ్‌.ఎం తదితర రంగాలలో పనిచేస్తున్న వారికి తక్షణమే హెచ్‌ఆర్‌ పాలసీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని,రెగ్యులర్‌, మినిమం టైం స్కేల్‌, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు ఒకటవ తారీఖునే వచ్చేటట్టు వార్షిక బడ్జెట్‌ ను విడుదల చేయాలన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.సుబ్రమణ్యం మాట్లాడుతూ పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్‌, ఎస్‌.జయచంద్ర, చినబాబు, కుమార్‌, బుజ్జి, వరలక్ష్మి, సుబ్బరత్నమ్మ, రఘు, పురుషోత్తం, సిద్దయ్య, నరసింహులు, మునిరాజా, శివ తదితరులు పాల్గొన్నారు. టిటిడి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల నిరసన ప్రదర్శన టిటిడి ఎఫ్‌ఎంఎస్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, లడ్డు కార్డు, దర్శన సౌకర్యం కల్పించాలని, మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు గది కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు నాయకులు టి.సుబ్రమణ్యం నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. టిటిడిలో వివిధ విభాగాల్లో 15వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి ఉద్యోగ భద్రత లేదన్నారు. కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు సిద్దయ్య, ప్రభాకర్‌, పార్థసారధి, కేశవులు, కష్ణమూర్తి, శంకర్‌, ఆనందు పాల్గొన్నారు.

➡️