కార్మికుల సమస్యలు పరిష్కరించాలిసామ్‌సంగ్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: సిఐటియు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలిసామ్‌సంగ్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: సిఐటియు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలిసామ్‌సంగ్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: సిఐటియుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: సామ్‌సంగ్‌ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, తమిళనాడు రాష్ట్రం పెరంబుదూరులో సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని సిఐటియు నాయకులు అన్నారు. మంగళవారం తిరుపతి నగరంలోని ఎస్‌కె ఫాస్ట్‌ఫుడ్‌ పక్కనున్న సామ్‌సంగ్‌ షోరూం వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, నగర ప్రధానకార్యదర్శి కె.వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌లో వేలాది మంది కార్మికులను అర్థాంతరంగా తొలగించి వారి స్థానం రోబోటిక్‌లను పెట్టుకుని పనిచేస్తాం అనడం సమజసం కాదని, వేలాది మంది కార్మికుల రోడ్డుపాలు చేయడం దారుణమన్నారు. గత నెలరోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యం వారితో చర్చలు జరపకపోవడం శోచనీయమన్నారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారిని పనిలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు జయచంద్ర, ఆర్‌.లక్ష్మి, టి.సుబ్రమణ్యం, పి.బుజ్జి, పి.మునిరాజా, పి.చిన్న, జి.వాసు, చిన్న వెంకటయ్య, బాదుల్లా, రఘుబాబు, గురవమ్మ, సాలమ్మ పాల్గొన్నారు.నాయుడుపేట: సామ్‌సంగ్‌ కంపెనీలో పని చేస్తున్న కార్మికులను అకారణంగా తొలగించడం దారుణమని సిఐటియు కార్యదర్శి ముకుంద అన్నారు. మంగళవారం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ ఎదురుగా ఉన్న సామ్‌సంగ్‌ కంపెనీ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి శివకవి ముకుంద, కె.విజయమ్మ, మురళి, గురవయ్య, కృష్ణయ్య కుమార్‌ పాల్గొన్నారు.పుత్తూరు టౌన్‌ : సామ్‌సంగ్‌ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లాకార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ సామ్‌సంగ్‌ కంపెనీలో 1200 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించి వారి స్థానంలో రోబోటిక్స్‌ను పెట్టి పనిచేయించుకోవాలని చూడటం దారుణమన్నారు. సిఐటియు మండల కన్వీనర్‌ ఏ.విజరు, నాయకులు వెంకటేష్‌, కృష్ణమూర్తి, రమేష్‌, చిరంజీవి, శివ పాల్గొన్నారు.

➡️