పాకాల లో వైసిపి టీడీపీల మధ్య ఘర్షణ ఫ్లెక్సీలు ఏర్పాటే ఘర్షణకు కారణం. పాకాలలో 144 సెక్షన్ అమలు.ప్రజాశక్తి రామచంద్రపురం (పాకాల ) పాకాల పట‌్టణంలో వైసీపీ వారు బన‌్నీ సినిమా విడుదల సందర్భంగా టీడిపి వారిని రెచ్చగొట్టే విధంగా ఏర‌్పాటు చేసిన ప‌్లెక‌్సీలు రెండు వర‌్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి.పాకాల పట‌్టణం లోని రామకృష్ణ డీలక్స్ థియేటర్ లో పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా వైసీపీ నేతల ఫ్లెక్సీలు మాజీ ముఖ్యమంత్రి జగన్,మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లో ఫోటోలతో పాటుగా టీడీపీ వారిని రెచ్చగొట్టే విధంగా కొన్ని వ‌్యాక‌్యలతో ప‌్లెక‌్సీలు ఏర‌్పాటు చేశారు.వాటిని తొలగించమని టీడీపీ వారు మాట్లాడంతో ముందుగా సిద్ధం చేసుకున్న కట‌్లు,ఇనుప రాడ‌్లతో టీడీపీ శ్రేణులపైకి వైసిపి వారు గొడవకు దిగారు.పోలీసులు ఇరువర‌్గాలను చెదరగొట్టారు. మంచి చేసి మోసపోయిన మాజీ ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలే ఘర‌్షణకు కారణం అని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ముందస్తుగా వైసిపి వారు ఇలా చేశారని టిడిపి వారు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పాకాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ ఇదించి పోలీసులు పహారకాస్తున్నారు.