సిఎం ప్రమాణస్వీకార మహోత్సవంప్రత్యక్ష ప్రసారం : కలెక్టర్‌

సిఎం ప్రమాణస్వీకార మహోత్సవంప్రత్యక్ష ప్రసారం : కలెక్టర్‌

సిఎం ప్రమాణస్వీకార మహోత్సవంప్రత్యక్ష ప్రసారం : కలెక్టర్‌ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజకవర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవ విజయవాడ సభకు మోబిలైజ్‌ చేయాలని, ప్రత్యక్ష ప్రసార వీక్షణకు పండుగ వాతావరణంలో ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమావేశమై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవానికి చేపట్టాల్సిన పలు అంశాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీక్షించి ఆర్డీఓలు, డివిజన్‌, నియోజక వర్గ, మునిసిపల్‌, మండల తహశీల్దార్‌, ఎంపిడిఓ, మునిసిపల్‌ కమిషనర్‌, తదితర అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి బస్సుకు ఒక నోడల్‌ అధికారి ఏర్పాటుతో బాధ్యతగా వారిని మంగళవారం ఉదయం తీసుకుని బయల్దేరి సాయంత్రం 5 గంటలకు సూచించిన ట్రాన్సిట్‌ పాయింట్‌ వద్ద వెళ్ళాలని రాత్రి బస ఏర్పాటు ఉంటుందన్నారు. అనంతరం మరుసటి రోజు బుధవారం సిఎం ప్రమాణ స్వీకార సభాప్రాంగణానికి వారిని తీసుకువెళ్లి జాగ్రత్తగా వారిని తిరిగి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. తాగునీరు తదితర ఏర్పాట్లు సదరు నోడల్‌ అధికారి బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. బస్సుకు ఫ్లెక్సీ ఏర్పాటు ఉండాలని తెలిపారు. సోమవారం నుండి 12వ తేదీ వరకు కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు, జిల్లా, నియోజక వర్గ, డివిజనల్‌, మండల ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ విద్యుత్‌ కాంతుల లైటింగ్‌ ఏర్పాటుతో పండుగ వాతావరణం ఉండాలని తెలిపారు. అంతే కాకుండా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రజలు వీక్షించేలా మండల స్థాయిలో మండల పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లలో, కమ్యూనిటీ హాల్‌, నియోజక వర్గాల్లో గుర్తించిన పెద్ద హాల్‌ లేదా కళ్యాణ మంటపం, మున్సిపల్‌ హాల్‌ తదితర వాటిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామ,వార్డు స్థాయిలో కమ్యూనిటీ హాల్‌ వంటి వాటిలో ప్రజలు ప్రత్యక్ష ప్రసారం వీక్షించే విధంగా టీవీ, ఇంటర్నెట్‌, డిష్‌ ఏర్పాటు ఉండాలని సూచించారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జిల్లా స్థాయిలో కార్యక్రమం కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు ఉంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌, పిడి లు డ్వామా శ్రీనివాస ప్రసాద్‌, డిఆర్‌డిఎ ప్రభావతి, మెప్మా రాధమ్మ, డిప్యూటీ సిఈఓ ఆదిశేషారెడ్డి, డిఎల్‌డిఓ సుశీల దేవి, డిటి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️