స్వచ్ఛతే లక్ష్యం..బాధ్యత మరువంశ్రీ మంగళంలో పారిశుద్ధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌శ్రీ స్వయంగా చెత్తను తొలగించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే పులివర్తి నాని

స్వచ్ఛతే లక్ష్యం..బాధ్యత మరువంశ్రీ మంగళంలో పారిశుద్ధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌శ్రీ స్వయంగా చెత్తను తొలగించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే పులివర్తి నాని

స్వచ్ఛతే లక్ష్యం..బాధ్యత మరువంశ్రీ మంగళంలో పారిశుద్ధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌శ్రీ స్వయంగా చెత్తను తొలగించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే పులివర్తి నానిప్రజాశక్తి-తిరుపతి మంగళం: స్వచ్ఛతే లక్ష్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను ఆదేశించారు. విధుల్లో బాధ్యతాయుతంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. బుధవారం మంగళంలో పారిశుద్ధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కలెక్టర్‌, ఎమ్మెల్యే స్వయంగా చెత్తకుండీలో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ ప్రజలకు గతంలో తెలుగుగంగ నీరు అందించేందుకు నిధులు మంజూరు చేశామని, ప్రభుత్వం మారడంతో ఆ విషయం మరుగున పడిందన్నారు. కాగా మంగళం ప్రాంత ప్రజలకు తెలుగుగంగ నీరు సరఫరా చేయడానికి అమసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ని ఎమ్మెల్యే కోరారు. ఆ ప్రాంతంలో నివాసముంటున్న పేదలకు చిందేపల్లి వద్ద పట్టాలిచ్చారని, అయితే వారికి టిడ్కో ఇండ్లు కట్టించేందుకు సర్వే ట్రైనింగ్‌ అకాడమికి కేటాయించిన స్థలాన్ని ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మంగళం ప్రాంతంలో జనాభాకు తగ్గట్టుగా పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేస్తామని, పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ స్టాప్‌ డయేరియా కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఫ్రైడే డ్రైడేను పాటించి దోమల వ్యాప్తిని అరికట్టాలన్నారు. తెలుగుగంగ నీటి సరఫరా, టిడ్కో ఇండ్ల నిర్మాణానికి అవసమైన మేరకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, జిల్లా పంచాయతీ అధికారి సుశీలదేవి, విద్యుత్‌శాఖ ఏఈ హరికృష్ణ, మంగళం పీహెచ్‌సీ వైద్యాధికారులు జయంతి, స్రవంతి పాల్గొన్నారు.పరామర్శ..పారిశుద్ధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మంగళంలో పలువురిని పరామర్శించారు. జయశంకర్‌ కాలనీలో జనసేన కార్యకర్త సాయి తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించారు. అదే కాలనీలో ఉంటున్న ప్రత్యేక ప్రతిభావంతురాలు అర్చన విన్నపం మేరకు పింఛన్‌ వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తుడా అధికారులు అడ్డుకున్న స్థలంలో తిరిగి ఆలయ నిర్మాణం చేపట్టేలా చేస్తానని అక్కడి స్థానికులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఈశ్వర్‌ రెడ్డి, గోపీనాథ్‌, మహేశ్వరి, మధు, ఈశ్వరయ్య, భాస్కర్‌ రెడ్డి, సురేష్‌, సుబ్బు యాదవ్‌, భాస్కర్‌ రెడ్డి, బాషా, రమణ, చలపతి తదితరులు పాల్గొన్నారు.

➡️