సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారిని రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమం వరదరాజ నగర్ పెట్రోల్ బంకు నుంచి టీటీడీ పరిపాలన భవనం వరకు సాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత వైసిపి ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని హామీని విస్మరించిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలామంది కాంటాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలతో ఎక్కువ పని భారం మోపుతున్నారని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. దీంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి కుటుంబ సభ్యులకు అమలయ్యేలా చూడాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జి బాలసుబ్రమణ్యం ఎస్ జయచంద్ర ఆప్కాస్ రాష్ట్ర నాయకులు చినబాబు, కాంట్రాక్ట్ పర్మినెంట్ తర కార్మికుల ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జి నాగ వెంకటేష్, సిఐటియు నాయకురాలు బుజ్జమ్మ, వివిధ ప్రభుత్వ శాఖల పని చేసే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.