కోర్టు నోటీసులు బేఖాతర్‌ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు అనధికారికంగా నియామకాలు ‘ఉపాధి’ రాజ’కీ’యంఆరు నెలలుగా జీతాల్లేవు బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లు గత కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హయాం నుంచి ఫీల్డ్ అసిస్టెంట్‌గా గత 15ఏళ్లుగా బతుకు జీవనం సాగిస్తున్నాం. ఈ ఉద్యోగంపైనే ఆధారపడి నా కుటుంబం ఉంది. ప్రస్తుతం ఆరు నెలలుగా జీతాల్లేవు. అప్పులు చేసుకుని బతుకుతున్నాం. యర్రమతి పద్మ స్పందిస్తూ తన భర్త చనిపోయాడని, బిడ్డలను పోషించుకోలేక రోడ్డున పడ్డానని వాపోయింది. అధికారులు మానవతా దృక్పధంతో న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. జీతాలిచ్చి విధుల్లో కొనసాగిస్తాం : శ్రీనివాస ప్రసాద్, పీడీ ఫీల్డ్ అసిస్టెంట్లుకు న్యాయం జరిగేలా చూస్తాను. ఆరు నెలల జీతాలు ఇప్పించి, విధుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకుంటాం. గతంలోనే ఈ విషయం చెప్పాను. మీ విధుల్లో మీరు ఉండండి అని తెలియజేశాను. ఎంపిడిఒ, ఎపిఒలతోనూ ఈ విషయమై మాట్లాడాను. ప్రజాశక్తి – కోట ‘మీరు ఫీల్డ్ అసిస్టెంట్లుగా కొనసాగాలంటే మాకేం అభ్యంతరం లేదు… ‘లోకల్’ పార్టీ నాయకులు ‘ఓకే’ అంటే మేం ‘ఓకే’.. మీమీ నాయకులను కలిసి ప్రసన్నం చేసుకోండి.. మీ మీ ఉద్యోగాలు చేసుకోండి’ ఇది ఎపిఒ తీరు.. ‘ఉపాధి’లో ఉద్యోగ భద్రత ఎలా ఉందో పై వ్యాఖ్యలు చెప్పకనే చెబుతుంది.. పేదల కడుపు నింపే ‘ఉపాధి’ హామీ పథకంలోనూ ‘లోకల్’ రాజకీయం రాజ్యమేలుతోంది. కోర్టు నోటీసులను బేఖాతర్ చేస్తోంది. కోట మండలంలో 21 పంచాయతీలు ఉన్నాయి. గత 15 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పథకంలో విధుల్లో ఉన్నారు. అయితే మండలంలో కొన్ని నెలలుగా ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను పనులు చేయనీకుండా, కొత్తవారిని రాజకీయ బలంతో నియమించి (రికార్డుపరంగా కాకుండా) పనులు చేయించుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్, వైసిపి, టిడిపి ప్రభుత్వాలు ఉన్నా వీరి ఉద్యోగాలకు ఢోకా లేకుండా ఉండేది. అయితే టిడిపి కూటమి హయాంలో పంచాయతీల్లో ‘రాజకీయ హవా’ నడుస్తోంది. నాయకుల కనుసన్నల్లో ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేసి, అనధికారికంగా కొత్తవారితో పనులు చేయించుకుంటున్నారు. సిద్దవరం, కొత్తపట్నం, అల్లంపాడు, వంజివాక, జరుగుమల్లి, కోట పంచాయతీల్లో ఇంగిలాల సోమశేఖర్, వాటంబేటి మస్తానయ్య, కర్లపూడి సుబ్రహ్మణ్యం, పామల పెంచలయ్య, కర్లపూడి వెంకట క్రిష్ణయ్య, యర్రమతి పద్మమ్మలను విధులకు దూరంగా ఉండాలని ఎపిఒ టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా చెప్పించినట్లు సమాచారం. దీంతో 15 ఏళ్లుగా విధుల్లో ఉన్న తమను ఏ ప్రాతిపదికన దూరంగా ఉంచుతారని హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు సైతం ‘యధావిధంగా విధుల్లో చేరండి’ అని ఆదేశించింది. కోర్టు తీర్పును సైతం పీడీ శ్రీనివాస ప్రసాద్‌ను కలిసి చూపించగా ‘మీరు యథావిధిగా విధుల్లో చేరండి’ అని ఆయనా చెప్పి పంపించేశారు. అయితే ఎపిఒ మాత్రం ‘లోకల్’ రాజకీయం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ఎపిఒను ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా తమదేమీ లేదని, ‘లోకల్ నాయకులను ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది’ అని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు హైకోర్టు నోటీసులు చూపిస్తే దాట వేయడం గమనార్హం. విసుగెత్తిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఇటీవల ఎంపిడిఒ భవానిని కలవగా ఎపిఒతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. అయితే ఎపిఒ వారం రోజులుగా కార్యాలయానికి రాకపోవడం గమనార్హం. కొత్తపట్నం, కోట పంచాయతీలకు ఆరు నెలలుగా జీతాలు రాలేదని, మిగిలిన వారికి మూడు నెలలుగా జీతాల్లేవని సమాచారం. సోమవారం ఎంపిడిఒ భవానిని, ఎపిఒ పూర్ణిమ సమక్షంలోఫీల్డ్ అసిస్టెంట్లు జీతాల విషయమై వాగ్వాదానికి దిగారు. ఎపిఒ పూర్ణిమ ‘లోకల్’ రాజకీయాన్నే మాట్లాడుతూ పొంతన లేకుండా ఎంపిడిఒకు సమాధానం ఇవ్వడం గమనార్హం.