తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా

Nov 14,2024 12:02 #Tirupati district

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కనకారపు మురళి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెరిగిన నిత్యవసర సరుకులు నియంత్రించాలని, ప్రభుత్వ భూములను, చెరువులు కుంటలను కాపాడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి పట్టణ అధ్యక్షులు సుబ్రమణ్యం, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర, 5వ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, లక్ష్మి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

➡️