ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి డిఇఓ కెవిఎన్ కుమార్.

ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి డిఇఓ కెవిఎన్ కుమార్.

ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి డిఇఓ కెవిఎన్ కుమార్. ప్రజాశక్తి రామచంద్రాపురం ొ ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో కెవిఎన్ కుమార్ అన్నారు. బుధవారం మెడ్జ్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అందిస్తున్న భోజన నాణ్యతను, వసతుల కల్పన, శిక్షణలో బోధిస్తున్న అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణలో 24 గంటలు వైద్యు సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు తరగతి గదిలో అన్వయించాలన్నారు. ఈ బ్యాచ్ లో తిరుపతి జిల్లాకి చెందిన 301 ఉపాధ్యాయులు శిక్షణా తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు తయారుచేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో శివశంకరయ్య, అసిస్టెంట్ ఏఎంఓ మధు , ఎంఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

➡️