జాతీయసేవా పథకం వాలంటీర్లకు ప్రచార సామాగ్రి పంపిణి

జాతీయసేవా పథకం వాలంటీర్లకు ప్రచార సామాగ్రి పంపిణి

జాతీయసేవా పథకం వాలంటీర్లకు ప్రచార సామాగ్రి పంపిణిప్రజాశక్తి – క్యాంపస్ :శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో పశువైద్య ఎన్ఎస్ఎస్ విభాగంలో వాలంటర్లుగా ఉన్న విద్యార్థిని, విద్యార్థులను కళాశాల స్వచ్ఛతహీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత పరిరక్షణ ప్రచార సామాగ్రిని అందజేసినట్లు అసోసియేట్ డీన్ డా.పి.జగపతి రామయ్య తెలిపారు. ప్రచార సామగ్రిలో మై భారత్ టోపిలు, పుస్తకాలు, పెన్నులు, చేతితొడుగులు అందించారు. ఎన్ఎస్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలలో చైతన్యం, అవగాహనను పెంపొందించుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాద్యత గా భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమలలో కళాశాల డా. రేణుక, ఎన్ ఎస్ ఎస్ అధికారులు శ్రీనివాసరావు, అమరావతి, వెంకటేశ్వర్లు, రాజా, మూడవ సంవత్సర విద్యార్థిని విద్యాయులు పాల్గొన్నారు.

➡️